ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని..అభిమాని ఈశ్వరయ్య పొర్లుదండాలు పెట్టారు. తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు మొక్కులు చెల్లించారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఈశ్వరయ్య, ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారిక కుటుంబానికి పట్టువస్త్రాలు పెట్టి సత్కరించారు. ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీ ఇచ్చారు.
నిన్న చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు. ప్రతీ ఏడాది అయ్యప్ప మాలను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాలను ధరించారు. మాలధారణలోనూ ఈశ్వరయ్య కుటుంబంతో చిరంజీవి కలిసి మాట్లాడారు. సాధారణంగా చిరంజీవి తన హార్డ్ కోర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలుస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిరూపణ అయింది. ఇప్పుడు ఈశ్వరయ్య గురించి తెలియగానే మరోసారి మెగాస్టార్ ఆయన్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు, జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేక సార్లు పొర్లుదండాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.