Mark Antony: రీతూ వర్మతో విశాల్ ప్రేమగీతం

కోలీవుడ్ హీరో విశాల్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఎస్ వినోద్ కుమార్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్‌కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది.

ఓ వైపు సినిమా పనులు వేగంగా ఫినిష్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ‘ఐ లవ్ యూ నే’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాస్ బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్ ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన లిరిక్స్, రామ్ మిరియాల గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. రియాలిటీకి దగ్గరగా ఉండే పదాలతో సాంగ్ ఫ్లో సాగిపోయింది. ఈ పాటలో హీరోహీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటోంది. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్‌గా మారింది.

ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అంతకు ముందు ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్.. ఇప్పుడు ఐ లవ్ యూ నే లిరికల్ సాంగ్‌తో యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేశారు. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో విశాల్ లుక్ సరికొత్తగా ఉండనుందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ స్పష్టం చేశాయి. విశాల్, సూర్య ఇద్దరూ కూడా ఫుల్ ఎనర్జీతో రంగంలోకి దిగుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తుండగా.. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ తీర్చిదిద్దుతున్నారు. టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథతో ఈ మార్క్ ఆంటోనీ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్
నిర్మాత: ఎస్ వినోద్ కుమార్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఫైట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్
డి.ఓ.పి: అభినందన్ రామానుజం
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్