27.7 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక పరిణామం

సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్‌ తీసుకుందని తెలుపుతూ.. MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపర్చారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. రేవ్ పార్టీ నిర్వహకులుగా 9 మందిని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ కేసులో ఇప్పటికే హేమ బెంగళూరు పరప్ప అగ్రహార జైలులో 14 రోజులు జైలు జీవితం గడిపిన ఆమె.. షరతులతో కూడిన బెయిల్‌తో బయటకు వచ్చారు. ఈ పరిణామాలతో హేమ సభ్యత్వాన్ని రద్దు చేసిన మా.. తిరిగి ఆగస్టులో ఆమెపై విధించిన బ్యాన్ ఎత్తివేసింది. మే 19న బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ కలకలం రేపింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్స్‌ చేయగా.. దాడుల్లో డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లోనే నటి హేమ పట్టుబడటం అప్పట్లో సంచనలంగా మారింది.

Latest Articles

కేరళలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా?

కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. పదేళ్ల వామపక్షాల పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్