జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత

స్వతంత్ర, వెబ్ డెస్క్: జనసేన పార్టీలో ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సమక్షంలో బీవీఎస్‌ఎన్‌ జనసేన తీర్థం పుచ్చుకొన్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్. అప్పట్లో పవన్ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈయన వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ద్వారా సినిమాలు తీశారు. బీవీఎస్‌ఎన్‌ పార్టీ చేరిక అనంతరం తెలంగాణ జనసేన నాయకులతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 26 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే జనసేన లక్ష్యమని అన్నారు. తెలంగాణ కోసం 1,300 మంది అమరులయ్యారని గుర్తుచేశారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు మనం నడుం బిగించాలని అన్నారు. ఏ పార్టీ ఇంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వలేదన్న పవన్.. జనసేన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్