25.2 C
Hyderabad
Saturday, January 4, 2025
spot_img

సనత్‌నగర్‌ బాలుడి హత్య… ఎక్కడికక్కడ ఎముకల్ని విరిచి.. బకెట్‌లో కుక్కి…

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ బాలుడి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్‌ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. సనత్​నగర్​లోని అల్లాదున్​ కోటి ఏరియాలో ఉంటున్న ఓ హిజ్రా బాలుడిని ఎత్తుకెళ్లి చంపేసింది. ఎక్కడికక్కడ ఎముకల్ని విరిచి.. ఓ బకెట్‌లో కుక్కి దారుణంగా హతమార్చింది. బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు నలుగురు వ్యక్తులు సహకరించారు. బాలుడి తండ్రి, హిజ్రా మధ్య చిట్టీ డబ్బుల విషయంలో గొడవలు తలెత్తడంతో ఈ దుర్మార్గపు చర్యకు హిజ్రా పూనుకున్నట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం సనత్​ నగర్​లోని నాలాలో ఓ బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతి చెందిన బాలునికి సుమారు 8 ఏళ్ల వయస్సు ఉంటుందని స్థానికులు అంటున్నారు. మొదటగా హిజ్రానే ఈ పని చేసుంటుందని స్థానికులు అనుమానించారు.

Latest Articles

ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి ఉండాలి- సీఎం చంద్రబాబు

దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 25 సంవత్సరాల్లో ఇది సాధ్యమైందని తెలిపారు. ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి,ఒక నిర్దిష్టమైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్