ఆమెరికాలో జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్ (25) మరణించారు. పైచావుల నిమిత్తం ఎంఎస్ చేయడానికి వెళ్లిన సాయేశ్.. అక్కడే గ్యాస్ స్టేషన్ లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. స్టేషన్ లో దొంగతనానికి చొరబడిన ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న సాయేశ్ ను తుపాకీతోకాల్చారు. దీంతో సాయేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, సాయేశ్ తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయారు. అతనికి తల్లి, అన్నయ్య ఉన్నారు. 2021 నవంబరులో ఎంఎస్ చేసేందుకు సాయేశ్ అమెరికా వెళ్లారు.