ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. టెర్మినల్ భవనంలోని అత్యాధునిక వసతులను పరిశీలించారు. విమానాశ్రయ టెర్మినల్ గురించి ప్రధానికి జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ వివరించారు. చెక్ ఇన్ హాల్, వసతుల గురించి ప్రధానికి వివరించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలు పరిశీలించారు. మోదీకి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఈ ప్రదర్శనలో 13 వేల మంది కళాకారులు పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేశారు మోదీ. ఈ సందర్భంగా మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం.. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించి మోదీ
0
60
Latest Articles
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. పేలిన ఏసీ.. ఊపిరాడక ఇద్దరు శిశువులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో...
- Advertisement -
- Advertisement -


