2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా… ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. కార్పొరేట్ పన్ను వసూళ్లలో 22 శాతం పెరిగి రూ.2.40 లక్షల కోట్లకు చేరింది. నాన్ కార్పొరేట్ పన్నుల్లో 12 శాతం వృద్ధి రేటు నమోదైంది. నాన్ కార్పొరేట్ పన్నుల వసూళ్లు రూ.3.84 లక్షల కోట్లకు చేరాయి. జులై 13 వరకు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్‌లు జారీ అయ్యాయి. పన్ను రీఫండ్‌లలో 14.57 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.


