నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా ఈమధ్య కాలంలో స్టార్ట్ అయ్యింది. హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ జోనర్లో సినిమాలు తీస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ.. సనాతన ధర్మం ట్రెండ్ మారింది అనిపించడానికి కారణం ఏంటి..?

ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమా ట్రెండ్ నడిస్తే.. ఆతర్వాత హార్రర్ కామెడీల ట్రెండ్ నడిచింది. ఈమధ్య కాలంలో పాన్ ఇండియా యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా సినిమాలు వస్తున్నాయి. నార్త్ జనాలను ఆకట్టుకోవడం కోసం పలువురు దర్శకులు, నిర్మాతలు ఈ తరహా కథలను ఎంచుకుంటున్నారు. అయితే.. ఇటీవల రిలీజైన కొన్ని సినిమాల రిజెల్ట్ చూస్తే.. ఈ ఫార్ములా ఆశించిన స్థాయిలో పని చేయడం లేదా..? ఈ ట్రెండ్ ఇప్పుడు లేనట్టేనా..? అనే డౌట్ రాకమానదు.

అఖండ 2 చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సనాతన ధర్మం ఎపిసోడ్స్, భారీ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే.. అవి ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. దీంతో అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. పవర్ స్టార్ హరి హర వీరమల్లు కూడా ఇదే తరహా విమర్శలను ఎదుర్కొంది. సెకండాఫ్లో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాల పై ఫోకస్ పెట్టినా జనాలకు కనెక్ట్ కాలేదు. మంచు విష్ణు నటించిన కన్నప్ప కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన భక్తి చిత్రం.ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది.

తాజాగా సనాతన ధర్మం కాన్సెప్ట్ తో నాగబంధం మూవీ రిలీజైంది. క్లైమాక్స్ మొత్తం సనాతన ధర్మం చుట్టూనే తిరుగుతుంది. అయినా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హిందీ మార్కెట్‌లో కూడా ఏ మాత్రం స్పందన రాలేదు. సనాతన ధర్మం ఇప్పుడు వర్కవుట్ కాకపోవడానికి కారణం ఏంటంటే.. కథ సహజంగా ఉండాలి.. అందులోనే భక్తికి సంబంధించిన ఎలిమెంట్స్ రావాలి కానీ.. కావాలని పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి సనాతన ధర్మం అంటూ అర్థంకానీ పద్దతిలో సీన్లు పెడితే.. ఫలితాలు ఇలాగే ఉంటాయి అంటున్నారు సినీ పండితులు.

Latest Articles

ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు

ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్