మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ మూవీ డైరెక్టర్. కొరియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న కొరియన్ కనకరాజు గురించి మేకర్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ లాక్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంతకీ.. కనకరాజు వచ్చేది ఎప్పుడు..? ఈసారైనా వరుణ్ ఆశించిన విజయం సాధించేనా..?
ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం.. ఇలా కెరీర్ ఆరంభంలోనే వైవిధ్యమైన చిత్రాలు చేసి మెప్పించాడు వరుణ్ తేజ్. అయితే.. ఈమధ్య కాలంలో నటించిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో.. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని చాలా కథలు విని ఫైనల్ గా కొరియన్ కనకరాజు అనే డిఫరెంట్ ఎంటర్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఎంటర్ టైనర్స్ ను బాగా డీల్ చేస్తాడనే పేరుంది. దీనికి తగ్గట్టుగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకోవడంతో.. కొరియన్ కనకరాజు మూవీ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
ఈ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండియన్, కొరియన్ నేపథ్యాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూ చూడని భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… కథానుగుణంగా ఈ సినిమా షూటింగ్నూ సౌత్ కొరియాలో చిత్రీకరించారు. వారం రోజుల పాటు అక్కడ కీలక షెడ్యూల్ చేశారు. అందులో పాటలతో పాటు, కథలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పిక్చరైజ్ చేశారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా, సత్య మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ కొరియన్ కనకరాజు మూవీని ఆగస్ట్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి.. కొరియన్ కనకరాజు.. పై వరుణ్ నమ్మకం ఎంత వరుకు నిజమౌతుందో చూడాలి.


