దటీజ్.. మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండడం విశేషం. 158వ సినిమా చేస్తున్న చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్ అనిపించారు అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. రీసెంట్ గా అలా టాక్ రావడానికి కారణం ఏంటి..? మెగా 158 అప్ డేట్ ఏంటి..? ఈ క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ.. ఈ ఇద్దరి కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా చేస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ మూవీ కోసం మెగాస్టార్ చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారని టాక్ వినిపించింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్ లో చిరంజీవి దాదాపు 12 గంటల పాటు యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్నారట. చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి అలసటకు లోనుకాకుండా పూర్తి అంకితభావంతో షూటింగ్‌లో పాల్గొనడం యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలుస్తోంది.

ప్రతి సినిమాతో తన కమిట్‌మెంట్‌ను చాటుకుంటున్న మెగాస్టార్ లేటెస్ట్ మూవీ కోసం కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారు. ఇదే కమిట్‌మెంట్… ఇదే మెగాస్టార్ మ్యాజిక్.. దటీజ్ మెగాస్టార్.. అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల కేరళలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ భారీ, క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ సాధించారు. మరి.. చిరు, బాబీ రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్