మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ

జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలు ఒక చోటకు తీసుకొస్తే…, అవగాహన లేకుండా మావిగన్ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, LPS లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి అనే దానిపై కాంట్రాక్ట్ సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు . అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తయ్యాయని.. ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ, IAS టవర్లు పూర్తవుతాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చు పోల్చుతూ వైసీపీ నేతలు ప్రజల్ని అడ్డదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్ నిజమేనా..?

నందమూరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. గత కొంతకాలంగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. సినిమా పట్టాలెక్కడం లేదు. బాలయ్య నుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. దీంతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్