ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా సీక్వెల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే.. బాహుబలి ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. బాహుబలి ది టార్చ్ బేరర్ వేదికగా ఊహించని విధంగా ప్రభాస్, రానా, అనుష్క.. అదిరిపోయే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇంతకీ.. ఆ అనౌన్స్ మెంట్ ఏంటి..?

బాహుబలి.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. బాహుబలి 2 మూవీ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. రీసెంట్ గా బాహుబలి ది టార్చ్ బేరర్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పెషల్ డాక్యుమెంటరీలో సినిమాలోని స్టార్స్ బాహుబలి గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బాహుబలి ది టార్చ్ బేరర్ నాలుగు ఎపిసోడ్స్ సిరీస్ గా వచ్చింది. అయితే.. ప్రభాస్, రానా, అనుష్క కలిసి మాట్లాడుతూ.. బాహుబలి లెగసి ఆగలేదు.. బాహుబలి పార్ట్ 3 ఉందని అనౌన్స్ చేశారు. ఇలాంటి అనౌన్స్ మెంట్ ఈ టైమ్ లో వస్తుందని ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దర్శకధీరుడు రాజమౌళి గతంలో బాహులి 3 ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ప్రభాస్, రానా, అనుష్క అనౌన్స్ చేయడంతో.. జక్కన్న ప్లానింగ్ మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా.. బాహుబలి 2 పార్టులుతో చరిత్ర సృష్టించిన రాజమౌళి ఈసారి బాహుబలి 3తో చరిత్ర తిరగరాస్తారని.. అంతకు మించి అనేట్టుగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతుండడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీని నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే.. వారణాసి తర్వాత రాజమౌళి బాహుబలి 3 స్టార్ట్ చేస్తారా..? లేక కొంత గ్యాప్ తర్వాత బాహుబలి 3 పట్టాలెక్కిస్తారా..? అనేది తెలియాల్సివుంది.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్