గాజు గ్లాస్ ఛాంబర్‌తో కూడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించడం ప్రమాదకరమని రవాణా శాఖ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా ఇటువంటి బస్సులను మూడింటిని సీజ్ చేశారు రవాణా శాఖా అధికారులు. ప్రయాణీకులు సైతం ఇటువంటి బస్సులలో ప్రయాణిస్తే ప్రమాదానికి లోనయ్యే అవకాశముంటుందని రవాణా శాఖ తెలిపింది. ప్రమాద సందర్భంలో గాజు గ్లాస్ క్యాబిన్ల వల్ల ప్రయాణికులు ప్రాణాలకు ముప్పు ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇటువంటి బస్సులు సీజ్ చేసినప్పుడు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యత ఆ యా యాజమాన్యాలదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస అగ్ని ప్రమాదాలకు గురవుతున్న సందర్బం గా వాటిపై తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్దంగా ఉండే బస్సులు, యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ స్పష్టం చేసింది.
గాజు గ్లాస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు
0
87
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


