బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన ఓ మోడల్ భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 11 కిలోలకుపైగా నాణ్యత కలిగిన హైడ్రోపోనిక్ మారిజువానాను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన మహిళను హర్ష సన్నీగా గుర్తించారు. జూన్ 10-11 తేదీల మధ్య రాత్రి బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానం టీజీ-351లో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో సాధారణ నిఘా తనిఖీల సందర్భంగా ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆమె వద్ద భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువ రూ.11.82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
రూ.11.82 కోట్ల విలువైన గంజాయితో పట్టుబడిన మోడల్
0
87
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


