దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది- రేవంత్ రెడ్డి

దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగ‌ణ‌న త‌ర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్ లో ఆయ‌న వివ‌రించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవ‌స‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలన్నా, దేశంలోని ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని చెప్పారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధేనని గుర్తు చేశారు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో పైస‌లు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా తేలింద‌ని చెప్పారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశారు.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్