ఖమ్మంలో దాడికి గురైన మైనర్ బాలిక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్. ” ఖమ్మం బాలికకు పూర్తి ఉచితంగా ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం. సీరియస్ కండిషన్‌లో అమ్మాయి నిమ్స్‌కు వచ్చింది. ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేయించి, వెంటనే అవసరమైన చికిత్స ప్రారంభించాం. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, అవసరమైన బ్లడ్ టెస్టులు అన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోనే ఉచితంగా చేపించాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది. నిపుణులైన డాక్టర్ల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. పాప తల్లిదండ్రులకు రూమ్ ఇచ్చాం. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్‌మెంట్, మెడిసిన్, ఫుడ్ అన్నీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నాం”.. అని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.
ఖమ్మంలో దాడికి గురైన మైనర్ బాలిక హెల్త్ బులిటెన్ విడుదల
0
69
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


