హైదరాబాద్ మాదాపూర్ లోని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల మేరకు మోహన్‌నాయక్ ఇంటితో పాటు ఆయన బంధువల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో 200 కోట్ల నగదు, ఆస్తులను అధికారులను గుర్తించారు. మోహన్‌నాయక్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో 60 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు తెలుస్తోంది. నగర శివారులో ఫామ్‌హౌజ్, విల్లాలు, సిటీలో ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్‌లో వ్యవసాయభూములను గుర్తించారు. అత్యంత ఖరీదైన విల్లాలతో పాటు అపార్ట్‌మెంట్లు, ఖాళీస్థలాలను గుర్తించిన ఏపీబీ అధికారులు..పలు కీలక పత్రాలు, రికార్డులు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్ ఇంట్లో 200 కోట్ల నగదు, ఆస్తులు గుర్తింపు
0
63
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


