పెద్ది రియల్ టాక్ ఏంటి..?

మెగా అభిమానులు మాత్రమే కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ది పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన పెద్ది వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చింది. ఈ క్రేజీ మూవీ ప్రీమియర్స్ షోల నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అయితే.. పెద్ది గురించే చర్చ అంతా. అయితే.. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా కావడంతో.. ఆల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అనే డౌట్ ఉంది. మరి.. పెద్ది ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి..? అసలు.. రియల్ టాక్ ఏంటి..? న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తుందా…? లేదా..?

చరణ్‌ పెద్ది కోసం పడిన కష్టం ప్ర‌తీ ఫ్రేములోనూ క‌నిపిస్తోంది. బుచ్చినీ, ఈ పాత్ర‌నీ చ‌ర‌ణ్ గ‌ట్టిగా న‌మ్మేశాడు. అందుకే పెద్ది కోసం ఎంత క‌ష్ట‌మైనా ప‌డ్డాడు. పాత్ర కోసం బాడీని మార్చుకొన్న విధానం అద్భుతం. చరణ్‌ కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ లో పెద్ది ఒకటిగా నిలుస్తుందని చెప్పచ్చు. తెర పై చరణ్ కష్టం కనిపిస్తే.. తెర వెనుక బుచ్చిబాబు కష్టం కనిపిస్తుంది. ఈ కథను చెప్పాలని.. దాదాపు ఓ ఐదు సంవత్సరాల పాటు వర్క్ చేసాడు. ప్రతి పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. అయితే.. జాన్వీ కపూర్ పాత్ర నడివి తక్కువే. ఫస్టాఫ్లోనే కాస్త ఎక్కువ సేపు కనిపిస్తుంది కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఒక సీన్లో ఒక పాటలో మాత్రమే కనిపిస్తుంది. జగపతిబాబు పాత్ర కూడా ఆయన కెరీర్ లో గుర్తుండిపోతుంది. శివ రాజ్ కుమార్ పాత్రను కూడా బుచ్చిబాబు బాగా చూపించాడు. ఆయన న‌డ‌క‌, న‌డ‌త బాగున్నాయి. ఈ మూవీకి రెహ్మాన్ పర్ ఫెక్ట్ అనేలా మ్యూజిక్ అందించారు. అది సినిమాకే హైలైట్ అని చెప్పచ్చు.

పెద్ది గురించి ఎవర్ని అడిగినా.. ఇది వన్ మేన్ షో.. చరణ్ కోసం ఈ సినిమా చూడాలనే టాక్ వినిపిస్తుంది. ఆల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అంటే.. ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ అవుతారా అంటే.. ఈ సమ్మర్ లో ఇంత వరుకు చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. మంచి సినిమా వస్తే.. చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుచేత ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ది సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ సమ్మర్ లో ఇంత వరుకు సరైన సినిమా రాకపోవడం పెద్దికి బాగా కలిసొస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇక రికార్డుల విషయానికి వస్తే.. ఈ సినిమా రిలీజైన ఆల్ సెంటర్స్ లో హిట్ టాక్ రావడంతో రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. తమిళనాడు, కర్నాటక, ఓవర్ సీస్ లో కూడా భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇంతకీ.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందంటే.. ప్రీమియర్స్ తో కలిపి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత ఎంతో నమ్మకంతో చేసిన పెద్ది చరణ్ నమ్మకాన్ని నిజం చేసింది. మరి.. బాక్సాఫీస్ దగ్గర పెద్ది న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Latest Articles

పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై ప్రయాణిస్తా- సీఎం చంద్రబాబు

పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరం కలిసి కృషి చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై ప్రయాణించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్