ఫారో దీవుల్లో ప్రతి ఏడాది జరిగే సంప్రదాయ వేట గ్రిండాడ్రప్‌పై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సంప్రదాయ వార్షిక వేటలో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లు హతమయ్యాయి. దీంతో సముద్ర జలాలు రక్తంతో ఎర్రగా మారాయి. పడవులు, బోట్ల సాయంతో డాల్ఫిన్లు, తిమింగలాలను తీర ప్రాంతానికి తీసుకొచ్చి హక్స్, కత్తులతో వాటిని హతమార్చారు. డాల్ఫిన్లు, తిమింగాలాలను చంపడానికి ఉపయోగించే స్పైనల్ లాన్స్ అనే ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండా కత్తులతోనే చంపడంతో అవి ఎక్కువ సేపు తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడిపోయాయని సీ షెపర్డ్ ఆరోపించింది. ఈ తతంగం మొత్తాన్ని తీరంలో నిలబడి పెద్దలు, పిల్లలు వీక్షించారు.
ఫారో దీవుల్లో సంప్రదాయ వేటలో విలవిలలాడుతూ చనిపోయిన 700 తిమింగలాలు, డాల్ఫిన్లు
0
61
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


