రైతుల మధ్య విభేదాలు సృష్టించి వైసీపీ విధ్వంసం చేయాలని చూస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. భవనాలు, రోడ్లు, పైపులైన్‌ల నిర్మాణం పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమేనా అని మంత్రి ప్రశ్నించారు. మాజీ సీఎంగా చేసిన వ్యక్తిగా అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారని మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ట్రంక్ రోడ్లు 43, ఎల్పీఎస్ జోన్లలో 32 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామన్నారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టిని తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయ్యిందని వివరించారు.
అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదం- మంత్రి నారాయణ
0
10
Latest Articles
ప్రముఖ యూట్యూబర్ రమా నందన కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా...
- Advertisement -
- Advertisement -


