గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించాడు. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తూ పేపర్ మీద రాసి ఉన్న మెసేజ్‌ని ఇంటి డోర్‌పై అంటించడం కలిచివేసింది. ఇటీవలె ఉద్యోగం కోల్పోయిన ఆయన.. తీవ్ర ఒత్తిడితో మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగి బలవనర్మణం చెందాడు
బాధితుడు పంకజ్ భన్సాలీ గుజరాత్‌లోని గాంధీనగర్ కుడసన్ ప్రాంతంలో పూనం రెసిడెన్సీలో నివసిస్తున్నాడు. ఇన్ఫోసిటిలోని స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఐదు నెలల క్రితం ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు.
ఆత్మహత్యకు పాల్పడే ముందు తన చేతితో రాసిన చీటీని ఇంటి బయట తలుపులకు అంటించాడు. సెల్ ఫోస్, విష వాయువు, మాస్క్ ధరించండి. నీరు తాగొద్దు.. అంటూ హెచ్చరించాడు. సెల్‌ఫోస్ అనేది ఒక పురుగుల మందు.. దీనిని తాగితే ప్రాణాలుపోతాయి. అందుకే విషపూరితమైన పొగల నుంచి తన కుటుంబం సురక్షితంగా ఉండాలని.. ముఖ్యంగా తన చిన్న కుమార్తె మాన్వీని బయటే ఉండమని చీటీలో కోరాడు.
తలుపు మీద ఉన్న ఆ చీటీ భన్సాలీకి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ, భద్రతను తెలియజేస్తుంది. కొన్ని రోజులుగా భన్సాలీ ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో ఆయన కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు మే 27న ఇంటి ఫ్లాట్ డోర్‌పై ఈ చీటీని గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. భన్సాలీ భార్య, కుమార్తె మే 13న పుట్టింటికి వెళ్లారు. దంపతులు చివరిసారిగా మే 22న మాట్లాడుకున్నారు. భన్సాలీ మే 22న ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. డెడ్‌బాడీ దాదాపు ఐదు రోజుల పాటు తాళం వేసిన ఫ్లాట్‌లోనే ఉండటంతో కుళ్లిపోయింది. ఘటనాస్థలిలో పురుగుల మందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉద్యోగం పోయిన బాధలో వ్యక్తి ఆత్మహత్య
పురుగుల మందు తాగి బలవన్మరణం చెందిన పంకజ్ భన్సాలీ
ఐదు రోజుల పాటు ఇంట్లోనే మృతదేహం
ఇంట్లోకి రావొద్దంటూ కూతురి కోసం తలుపులపై నోట్ అంటించిన భన్సాలీ
సెల్‌ఫోస్, విషవాయువు, మాస్క్ ధరించండి, నీరు తాగొద్దు.. అంటూ హెచ్చరిక


