ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్ చిన్నప్పన్న అరెస్ట్

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో స్పెషల్‌ లైజనింగ్‌ అధికారి, స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన కాదూరు చిన్నప్పన్నకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. జూన్‌ 8 వరకు చిన్నప్పన్నకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే అభియోగంపై నిన్న చిన్నప్పన్నను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి చిన్నప్పన్న అరెస్టు చేశారు. అప్పట్లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేసిన చిన్నప్పన్న, వైవీ సుబ్బారెడ్డి ఆశీస్సులతో ఏపీ భవన్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌గా ఢిల్లీలో పనిచేశారు. ఈ సమయంలో చిన్నప్పన్న విపరీతంగా ఆస్తులు వెనుకేసినట్టు ఫిర్యాదులు అందటంతో విశాఖ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. భారీగా ప్లాట్లు కొనుగోలు చేసినట్టు సోదాల్లో గుర్తించారు. మార్కెట్‌ విలువ ప్రకారం అక్రమాస్తులు 20 నుంచి 30కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Latest Articles

గోదావరి జలాలు కలుషితంపై పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం

పవిత్ర గోదావరి జలాలు కలుషితం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యనటలో భాగంగా వెంకటనగరం వద్ద కాలుష్య వ్యర్థాలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్