కేంద్ర మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి.. వారికి ఉద్వాసన తప్పదా?

కేంద్ర మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యవస్తీకరణలో భాగంగా 20-30 మంది మంత్రులను తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరి స్థానంలో కొత్త సభ్యులకు చోటు కల్పించే దిశగా మోదీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రివర్గ పనితీరు, పరిపాలనా సామర్థ్యంపై ప్రధాని మోదీ 5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సేవాతీర్థ్‌లో జరిగిన ఈ సమావేశానికి క్యాబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ముఖ్యంగా మంత్రిత్వ శాఖల పనితీరుపై పీఎంఓ ముందుగానే ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయగా శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శుల పనితీరును క్యాబినెట్‌ కార్యదర్శి వివరించారు.

ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యాల సాధన, పరిపాలనా బాధ్యతల నిర్వహణలో ఉన్న లోపాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపై ప్రధాని సమగ్ర సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని… భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు,కార్యదర్శులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థ పని తీరు మారాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయబడ్డారు.

ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పనిచేయాలని…ప్రజాధనాన్ని వీలైనంతగా పొదుపు చేయాలని ప్రధాని సూచించారు. సమర్థవంతమైన పరిపాలనతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి జాతీయ రోజ్‌గార్‌ మేళా అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. మోదీ 3.0 పాలనకు రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖల పనితీరును సమీక్షించడం… నిర్లక్ష్యం వహించిన శాఖల మంత్రులను హెచ్చరించడం ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా నిలిచింది.

కొన్ని మంత్రిత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లక్ష్యాల సాధనలో జాప్యం, అమలులో లోపాలు, బలహీన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సునిశిత సమీక్ష నిర్వహించారు. బాధ్యతాయుత పరిపాలన, సమర్థత విషయంలో మంత్రులు, అధికారులకు ఆయన గట్టి సందేశం ఇచ్చారని… సమన్వయం, క్రమశిక్షణ, ప్రజాధన వినియోగంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇక కీలక సమీక్ష ముగిసిన అనంతరం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా శాఖల మార్పులు తప్పవనే ప్రచారం జోరందుకోవడంతో కొందరు మంత్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇంధన, ఆర్థిక జాతీయ సవాళ్లను ఎదుర్కొనే ప్రభుత్వ సన్నద్ధతపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఇంధన, పెట్రోలియం, వ్యవసాయం, ఎరువులు, పౌర విమానయాన, షిప్పింగ్ & లాజిస్టిక్స్ వంటి కీలక శాఖలతో పాటు ఉపాధి కల్పన , సంక్షేమ పథకాల అమలుపై సీరియస్ గా చర్చించారు. అలాగే భవిష్యత్ కార్యచరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశాలు నిర్వహించి రాష్ట్రాల వారీగా కొత్త టీంల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. జాతీయ స్థాయిలో కొత్త ఆఫీస్‌ బేరర్ల నియామకం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల ఎంపిక, యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా వంటి అనుబంధ విభాగాల్లో మార్పులు, 2026 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేపట్టనున్నారు.

దక్షిణాది ప్రాతినిధ్యం అంశాలపై తెలంగాణకు సంబంధించి సంస్థాగత పదవులు,కేంద్ర మంత్రి వర్గంలో ముఖ్యంగా మహిళా నాయకత్వంపై పార్టీ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో NDA మిత్రపక్ష సమీకరణలు, టీడీపీ-బీజేపీ సంబంధాల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కూడా కేంద్రంలో మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌కు 2027 రాజకీయ వ్యూహాల దృష్ట్యా కేంద్ర నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దక్షిణాదిలో విస్తరణ లక్ష్యంగా ప్రాతినిధ్యం పెంచే అవకాశాలపై చర్చ జరిగింది.

2027 నుంచి 2029 వరకు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2027 ఫిబ్రవర, మార్చి నెలల్లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అదే ఏడాది నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్, డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2028 ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2028లో కర్ణాటకలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక నవంబర్ 2028లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే-జూన్ 2029లో దేశవ్యాప్తంగా లోక్‌సభ సాధారణ ఎన్నికలు నిర్వహించే విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ ఏడాది జూన్ 9న ప్రధాని మోదీ నేతృత్వంలోని “మోడీ 3.0” ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత NDA ప్రభుత్వం 2024 జూన్ 9న అధికారంలోకి వచ్చింది. అలాగే ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము పదవీకాలం వచ్చే ఏడాది 2027 జూలై 25తో ముగియనుంది. తదుపరి రాష్ట్రపతి ఎన్నికలు 2027 మధ్యలో జరగనున్నాయి.

Latest Articles

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఫ్యాన్ పార్టీ, ఆ ఓటమి భారం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్