బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రచారాల వల్ల అమ్మాయి కుటుంబం ఇబ్బందులు పడ్డారని వివరించారు.
కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్.. కేటీఆర్ మనిషా.. రాజకీయం రాజకీయంగా చూడాలని అన్నారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని వివరించారు. కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదని ఫైరయ్యారు. మైనర్ అమ్మాయిని అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
ఏ కేసులో అయినా పోలీసులకు ఒక ప్రొసీజర్ ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. ఫిర్యాదు రాగానే కేసు ఫైల్ చేయాలని అన్నారు. 24 గంటల్లో అమ్మాయి స్టేట్‌మెంట్ తీసుకోవాలని.. సున్నితమైన సమస్యను.. సున్నితంగానే పరిష్కరించామని చెప్పారు.
మా చర్యల్లో ఎక్కడైనా లోపం ఉందా?.. అని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్, బండి సంజయ్‌కి ఏదో పంచాయతీ ఉన్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగమే ఉందని కేటీఆర్ అనుకుంటున్నట్టు ఉన్నాడని.. మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే..
ప్రతిపక్ష నేత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కి బాధ్యత లేదా? అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.


