హాస్టళ్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు.. ధైర్యంగా బయటపెట్టిన యువతి

ప్రైవేటు హాస్టళ్లపై ఎప్పటి నుంచో పలు ఆరోపణలు వస్తున్నా.. ఆధారాలు దొరక్కుండా అక్రమార్కులు జాగ్రత్తలు పడుతున్నారు. చాలా కాలంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని,.. తెలిసినా ఆధారాలు లేకపోవగంతో ఈ ఆరోపణలు వెలుగులోకి రాలేదు. అయితే హాస్టళ్ల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోలో.. తనకు ఎదురైన అనుభవాలను బాధిత యువతి చెప్పింది. ప్రైవేటు హాస్టళ్లు కేవలం నివాస సౌకర్యం కోసం కాకుండా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని ఆమె చెబుతోంది. డబ్బులు కట్టించుకున్నా సరైన సౌకర్యాలు లేవని.. ఆహారం కూడా నాణ్యత ఉండదని చెప్పింది. అలాగే అమ్మాయిలతో హాస్టల్ యజమాని ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెబుతోంది. హాస్టల్ యజమాని కొడుకు సైతం బిహేవియర్‌ సరిగా ఉండదని ఆమె ఆరోపించింది.

హాస్టళ్లలో జరుగుతున్న దారుణ అసాంఘిక కార్యకలాపాలపై తనకు ఎదురైన అనుభవాన్ని ధైర్యంగా బయటపెట్టింది ఓ బాధిత యువతి. అందరికీ అన్నీ తెలిసినప్పటికీ డబ్బు మత్తులో అక్రమాలను బయటకు రానివ్వకుండా తొక్కిపెడుతున్నారు..!

ఎవరైనా బయటపెట్టాలని చూస్తే వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు యజమానులు. ప్రైవేట్ వ్యక్తులతో నిఘా ఏర్పాటు చేసుకుని.. అనుమానితులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు యాజమాన్యాలపై గత పదేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్