ఆసిఫ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎంజే క్లాసిక్‌ ఫర్నిచర్‌ గోదాంలో మంటలు

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

ఫర్నిచర్ గోదాం పైభాగంలో రెండు అంతస్తుల నివాస ఫ్లాట్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు.

ఇక పోలీసులు భవనంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తరలిస్తున్నారు. లోపల ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో ఫైర్ ఫైటర్స్, పోలీసులు కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్