మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు- జగన్

ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 24 వరకు జగన్‌ 1.0 ప్రభుత్వం నడిచిందన్నారు. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచిందని చెప్పారు. లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశామని తెలిపారు. కోవిడ్‌ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశామని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని తెలిపారు. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని జగన్ అన్నారు.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్