కాంగ్రెస్ ఏడాది పాలనలో గుండె దిగులుతో రైతన్నలు కాలం వెల్లదీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో నింపుకున్న వెలుగులు… ఏడాది కాంగ్రెస్ పాలనలో మటుమాయం అవుతున్నాయంటూ విమర్శించారు. పాలమూరులో పల్లికి, వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం, బయ్యారంలో కరంటు కోసం, జగిత్యాలలో యూరియా కోసం రైతన్నలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయని చెప్పారు. రైతుబంధు కోసం, రైతుబీమా, రుణమాఫీ, కరెంటు, యూరియా, సాగునీటి, పంటల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏడాది పాలన.. ఎదురుచూపుల పాలన అంటూ విమర్శించారు. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఏడాది పాలన.. ఎదురుచూపుల పాలన- కేటీఆర్
0
191
Latest Articles
మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -
- Advertisement -


