కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా

విజయవాడ నగరానికి సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోమంత్రి అమిత్‌షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) ప్రాంగణాన్ని అమిత్‌షా ప్రారంభించారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ రైజింగ్‌ డేలో హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. రూ.160 కోట్ల వ్యయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ 10 బెటాలియన్‌ను అమిత్‌ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, రామ్మోహన్‌ నాయుడు కూడా పాల్గొన్నారు.

ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎలా పనిచేస్తాయి?.. ఎలాంటి సహాయక చర్యలు చేపడతాయి?.. ఎంత త్వరగా ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలిస్తారు?.. అనే విషయాలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రదర్శించాయి. వీటిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తిలకించారు.

Latest Articles

చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు

విజయవాడ రౌడీషీటర్‌ సాయికృష్ణ మిస్సింగ్‌ మిస్టరీలో అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు వారికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్