ఏపీలో జోరుగా కోడి పందాలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగు రోజుల పండుగలో వాడవాడలా భోగి మంటలు వేసి పండగను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇళ్ల ముందు రంగులతో ముగ్గులు వేసి మహిళలు పండుగకు స్వాగతం పలికారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక ఏపీలోని గోదావరి జిల్లాల్లో కోడి పందేలు కూడా అంతే సందడిగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెల్లోని బరుల్లోనూ పందేలు ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నందిగామ, చందర్లపాడులో ఈ పోటీలు సాగుతున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడి పందేలను డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు.

Latest Articles

తగ్గిన గోల్డ్‌ ధరలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌రేట్‌ 950...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్