తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 13 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. జనవరి 13 నుంచి 23 వరకు ఫారిన్ టూర్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పటించారు. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
0
166
Previous article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


