తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌కు చేరుకున్న ఆయన.. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు పవన్‌కు వివరించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాసేపట్లో స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.