మద్యం మత్తులో ఎటీఎం స్క్రీన్‌ పగులగొట్టిన వ్యక్తి

మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి బ్యాంకు అధికారులు రాత్రిరాత్రే ఉరుకులు పరుగులు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఎస్‌బీఐ ఏటీఎం ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఎస్‌బీఐ ఏటీఎంలోకి వెళ్లి ఏటీఎం స్క్రీన్‌ను బండరాయితో పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో సైరన్ మోగడంతో అతను ఆ ప్రయత్నాన్ని విరమించి పారిపోయాడు. అయితే ఏటీఎంను బండరాయితో పగలగొట్టేందుకు ప్రయత్నించే సమయంలో ముంబైలో ఉన్న హెడ్ ఆఫీస్ కు అలర్ట్ వెళ్లింది. వెంటనే అక్కడి అధికారులు అప్రమత్తమై గోపాలపురం బ్రాంచ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్బిఐ అధికారులు గోపాలపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోపాలపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి విచారణ చేపట్టారు. గోపాలపురంలోని స్థానికంగా ఉండే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకు వచ్చి అతనిని వెతికే పనిలో పడ్డాడు. దీనిపై బ్రాంచ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్