Chandrababu | ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. జగన్(Jagan)పాలనలో అరాచకాలు, ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సంకల్ప సిద్ధి స్కాం కేసులో వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేత పట్టాభి(Pattabi)పై దాడి చేయడం, అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni vamsi) ఆధ్వర్యంలోనే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందని లేఖలో పొందుపరిచారు. దాడుల గురించి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఆగడాలపై అందరం కలిసికట్టుగా పోరాడి రాష్ట్ర భవిష్యత్ ను కాపాడుకుందాం అని ప్రజలకు చంద్రబాబు(Chandrababu) పిలుపునిచ్చారు.
Chandrababu | వైసీపీ అరాచకాలను అడ్డుకుందాం.. ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
0
526
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


