త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో ఘనవిజయం సాధించాలని..తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా ఆమె నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొక్కులు చెల్లించుకోవాలని అనేక సార్లు అనుకున్నట్లు తెలిపారు. నేడు ఆ మొక్కులు చెల్లించుకునే భాగ్యం దక్కిందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు తెలంగాణ మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందజేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో మంత్రిని సత్కరించారు.
ప్రియాంక గాంధీ వయనాడ్ లో ఘన విజయం సాధించాలి – సీతక్క
0
168
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


