పాలకుర్తిలోనూ హైడ్రా అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు – ఎర్రబెల్లి

పాలకుర్తిలోనూ హైడ్రా అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముసుగులో కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చినమడూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గొడవలు జరిగితే కాంగ్రెస్​ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేయడం ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నాయకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నామని యశస్విని రెడ్డి అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులో మార్పు రాలేదని పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని, ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఎర్రబెల్లి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎర్రబెల్లి కుట్రలను, జిమ్మిక్కులను పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఝాన్సీ రెడ్డి.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్