నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా వేడుకలకు రావాల్సిందిగా ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ తాజాగా నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ని కలిసింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు తదితరులు వెళ్లి అల్లు అర్జున్‌ను ఆహ్వానించారు. అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను తప్పక వస్తానని చెప్పారు.
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అల్లు అర్జున్‌కు ఆహ్వానం
0
358
Previous article
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


