25.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

మాలీవుడ్‌ను కుదిపేస్తున్నహేమ కమిటీ రిపోర్టు

మలయాళ చిత్ర పరిశ్రమను జస్టిస్ హేమ కమిటీ నివేదిక కుదిపేస్తోందా..? లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారా..? నటీమణుల ఆరోపణలపై.. మలయాళ అగ్రనటులు, రాజకీయ వేత్తలు ఏమంటున్నారు? కేరళ ప్రభుత్వం .. ఏవిధంగా ముందుకెళ్తోంది.. ? మాలీవుడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం..

తాజాగా మాలీవుడ్‌ను జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు కుదిపేస్తోంది. 2017లో ఓ నటిపై లైంగిక వేధింపులకు సంబంధించి నటుడు దిలీప్​పై కేసలు నమోదైన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. హేమ కమిటీ రిపోర్ట్​ను 2019లో ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికపై మలయాళ చిత్ర నిర్మాత ఒకరు.. కేరళ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీంతో హేమ కమిటీ నివేదిక విడుదల ఆగిపోయింది. అప్పటి నుంచి నివేదిక కేరళ ప్రభుత్వం వద్ద ఉన్నా బయటకు రాలేదు. 2024 ఆగస్టు నెలలో సమాచార హక్కు చట్టం కింద.. హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చింది. దీంతో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి.

మాలీవుడ్‌లో మహిళల సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్లపై హేమ కమిటీ లోతుగా విచారణ చేసింది. సినిమా సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం, కాస్టింగ్‌ కౌచ్​ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళల ఇబ్బందుల గురించి హేమ కమిటీ రీసెర్చ్ చేసింది. చిత్ర పరిశ్రమలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని… భయం కారణంగా బాధితులు ఫిర్యాదు చేయడం లేదని నివేదిక తేల్చింది. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ క్రిమినల్​ గ్యాంగ్​ నియంత్రణలో ఉందని హేమ కమిటీ నివేదిక ఇచ్చింది.

ప్రస్తుతం జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖుల నుంచి.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని నటీమణులు ఆరోపించారు. దీంతో కేరళ విజయ్ పినరయ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మాలీవుడ్ మహిళాల ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్పర్జన్‌ కుమార్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదు అయ్యాయి.

తాజాగా నటి మిను మునీర్ చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపాయి. ఆమె మాట్లాడుతూ 2013లో ఒక ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేశానన్నారు. ఆ టైమ్‌లో ప్రముఖ నటుడు జయసూర్యతోపాటు ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు వల్ల .. ఇబ్బందులు ఎదుర్కొన్నానని మిను మునీర్ ఆరోపించారు. ఈ విషయం బయపెట్టిన దగ్గరి నుంచి.. బెదిరింపు కాల్స్ ,మెస్సేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం మాలీవుడ్ పరిశ్రమలో విషయం మరో చర్చనీయాంశంగా మారింది.

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో .. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అధ్యక్ష పదవికి .. మాలీవుడ్ అగ్రనటుడు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ‘అమ్మ’ సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మాలీవుడ్​ నటీనటులు, దర్శకులపై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్రం మంత్రి సురేష్‌ గోపి స్పందించారు. సినీ పరిశ్రమపై ప్రజల అభిప్రాయాన్ని మీడియా తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్ర మంత్రి సురేశ్​ గోపి మండిపడ్డారు. ఫిర్యాదులు ప్రస్తుతం ఆరోపణల రూపంలో ఉన్నాయని.. అన్ని విషయాలను కోర్టు నిర్ధారిస్తుందన్నారు. ప్రస్తుతం ఈవిషయాలను మీడియా పోటీ పడి ప్రచారం చేయడం మంచిది కాదని సురేష్‌ గోపి చెప్పారు.

హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటుడు నాని స్పందించారు. మహిళలపై లైంగిక వేధింపులను చూస్తుంటే.. ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో బతుకున్నామా అనిపిస్తోందని నాని అన్నారు. సినీ పరిశ్రమలో అప్పటి రోజుల్లో మహిళలకు కాస్త రక్షణ ఉండేదన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని నాని తెలిపారు. మరిన్ని రోజుల్లో హేమ కమిటీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో..ఎవరి బాగోతాలు బయటకు వస్తాయో చూడాలి.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్