నేపాల్‌లో బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన పర్యటక బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా 43 మంది నేపాల్‌లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూకు బయలుదేరారు. తనహూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో వెళుతుండగా వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కన 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి ఎయిర్‌ఫోర్స్ విమానం నేపాల్ వెళ్లనుంది.
నేపాల్ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య
0
183
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


