కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై నోట్లను గాల్లోకి వెదజల్లిన యూట్యూబర్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం డబ్బులు వెదజల్లుతూ..ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు హర్ష. మోతీనగర్ పరిధిలోని పర్వత్ నగర్‌లో ఉంటూ..ఇన్‌స్టాగ్రాంలో తరుచూ పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ పెడుతుంటాడు.
ఈనేపథ్యంలోనే జూన్‌లో కూకట్‌పల్లి మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో నోట్లను వెదజల్లాడు. ఆ డబ్బును ఏరుకోవడానికి పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.