పార్లమెంట్ సమావేశాల నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్ సభ ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెల కొంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచాఫ్ కావడంతో పైనా కూడా స్పీకర్ ఓం బిర్లా వివరణ కూడా ఇచ్చారు. అయితే.. ఎంత సేపటికీ నీట్- యూజీ 2024పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అయితే, అంతకు ముందు రాహుల్ గాంధీ నీట్ వివాదం గురంచి ప్రస్తావించారు. పార్లమెంట్ వేదికగా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహార ప్రాధాన్యతను అర్థం చేసుకుని సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ దానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. ఫలితంగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరనస వ్యక్తం చేస్తూ పార్లమెంట్ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.
పార్లమెంట్ నుంచి విపక్షాలు వాకౌట్
0
219
Previous article
Next article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


