హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోద యిన కేసు విషయంలో వైసీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కేసు ఎఫ్‌ఐఆర్ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకొని విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ప్రయత్నించారంటూ హయగ్రీవ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన సీహెచ్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆరిలోవ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. దీనిలో తనపై నమోదయిన కేసును కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చడానికి వీల్లేదన్నారు. అరెస్టు నుంచి పిటిషనర్‌కు రక్షణ కల్పిం చాలని కోరారు. ఈ వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేసింది.
మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ
0
385
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


