కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి చర్చలు సఫలమేనా?

తెలంగాణలో 16 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చి, వాటికి నెంబర్లను కేటాయిం చాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఢిల్లీలో కోమటిరెడ్డి పర్యటనలో నితిన్‌ గడ్కరీని కిలిసి తెలంగాణలోని రోడ్లు, నిధుల కేటాయింపులపై చర్చిం చారు. ఈ సందర్భంగా ఆయన.. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలు గా వెంటనే విస్తరించాలని నితిన్‌ గడ్కరీని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి తెలిపారు.

దేశంలోనే అత్యధిక ట్రాఫిక్‌ ఉండే మార్గాల్లో ఒకటైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని జీఎంఆర్‌ నిర్మాణ సంస్థ 2024కల్లా ఆరు వరుసలుగా విస్తరించాల్సి ఉందని కోమటిరెడ్డి వివరించారు. 17 యాక్సిడెంట్‌ స్పాట్లను సరిదిద్దడానికి 370 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ పనులతో శాశ్వత పరిష్కారం ఉండదని, ఈ మార్గాన్ని ప్రమాదరహితంగా మార్చాలంటే ఆరు వరుసలుగా విస్తరించాలని మరోసారి గడ్కరీని మంత్రి కోరారు. త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటుచేసి పరిష్కరిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని అన్నారు. అలాగే రాష్ట్రంలో 16 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరానని కోమటిరెడ్డి చెప్పారు. ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరిన వెంటనే, సంబంధిత అధికారులతో మాట్లాడి పాత కాంట్రాక్టర్‌ను తొలగించి, కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించారని కోమటిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రీజనల్ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జెస్‌ తాము భరించలేమని కేంద్రానికి లెటర్‌ రాసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఛార్జీలను తామే భరిస్తామని కేంద్రానికి లెటర్‌ రాయడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రీజనల్‌ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని కూడా వెంకట్‌రెడ్డి కలిశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో తాను కేంద్ర మంత్రులు భూపేందర్‌యాదవ్, కిషన్‌రెడ్డిలను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళతానన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతుల కోసం భూపేందర్‌ యాదవ్‌ను కలుస్తానని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చెప్పారు.

Latest Articles

మెక్సికోలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో నమోదు

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. చియాపాస్‌ రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణమైన ప్యూర్టో మడెరోలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 7.4 తీవ్రతతో నమోదైంది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్