బీహార్ లో నిర్మాణ దశలోనే కూలిన బ్రిడ్జ్

బీహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్‌ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడువక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మోతీహరిలో రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. నాణ్యత లోపం వల్లే ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగినపాళ్లలో సరిపోకపోవడం, కాస్టింగ్‌ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్‌ పైపు బలహీనంగా ఉండ టంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వారం రోజుల్లోనే రాష్ట్రంలో వంతెనలు కుప్పకూలిపోవడం ఇది మూడోసారి. అరారియాలోని బక్రా నదిపై రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఈ నెల 18న కూలిపోయింది. ఈ నెల 22 సివాన్‌లోని గండక్‌ కాలువపై వంతెన కుప్పకూలింది. ఈ నేపథ్యంలో నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

Latest Articles

జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?

దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్