ఢిల్లీలో ఓ వైపు వేడి.. మరో వైపు నీటి సంక్షోభం

ఢిల్లీలో వడగాడ్పులు నేడు కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క ఢిల్లీలో మంచినీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చర్చిస్తోంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ తోపాటు ఢిల్లీలో పలు ప్రాంతాలు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో కూడా సూర్యప్రతాపం వడగాడ్పులు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత నేడు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ముంగేష్ పూర్ వాతావరణ కేంద్రం బుధవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్ గా చూపినా ఇది సెన్సార్ల తప్పిదం కావచ్చునని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీ ప్రజలకు శుక్రవారం కాస్త ఊరట లభించే అవకాశం ఉందని .. తేలికపాడి వర్షం లేదా,, జల్లులు పడి ఉపశమనం కలగవచ్చునని వాతావరణ శాఖ ముందస్తు అంచనా.

జూన్ 1 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని, రాబోయే 2-3 రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు క్రమంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్