వికారాబాద్ జిల్లా ఘనాపూర్ గ్రామంలో గుర్రాలు హల్చల్ చేశాయి. వారం రోజుల క్రితం గ్రామంలోకి వచ్చిన మూడు గుర్రాలు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు ముందు కాళ్లు లేపి కిందపడేసి వెనుక కాళ్లతో తన్ని దాడి చేస్తున్నాయి. గుర్రాల దాడిలో ఇప్పటికే ముగ్గురు గాయపడ్డారు. దీంతో ప్రజలు గుర్రాలు కనబడితే చాలు పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇళ్లలోకి పరుగులు పెడుతున్నారు. గుర్రాల తాకిడి తట్టుకోలేక గ్రామస్తులంతా ఏకమై వాటిని పట్టుకొని కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తామేం చేసుకోవాలని లైట్ తీసుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతూ తమను వాటి బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఘనాపూర్ గ్రామంలో గుర్రాలు హల్ చల్
0
285
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


