దేశంలో ఐదోవ దశ పోలింగ్ సర్వం సిద్ధం అయ్యాయి. ఐదో దశ పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు 5వ దశ పోలింగ్ జరుగనుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ ఉంటుంది. జమ్ముకశ్మీర్, లడక్‌లో ఒక్కో స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. మరోవైపు కాంగ్రెస్‌కు కీలక స్థానాలు రాయబరేలీ, అమేథిలో రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాయబరేలీలో రాహుల్, అమేథిలో కేఎల్ శర్మ పోటీ ఉంటుంది. బరిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ ఉన్నారు. 49 నియోజ కవర్గాల్లో శనివారం సాయంత్రం ముగిసింది ప్రచారం.మహారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లోనూ రేపే పోలింగ్ జరగనుంది. ఉమ్మడి శివసేనకు పట్టున్న ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ చీలిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వ ప్రాభవం ఒకవైపు.. ముంబయిలో మెగా ప్రాజెక్టుల పూర్తి మరోవైపు ఇక్కడి పోటీని ఆసక్తిగా మలిచాయి.
ఎనిమిది రాష్ట్రాల్లో జరగనున్న పోలింగ్
0
537
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


