రాజస్థాన్ లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కు చెందిన గనుల్లో 15 మంది అధికారులు చిక్కుకు పోయారు..దాదాపు 12 గంటలపాటు నిర్విరామంగా ప్రయత్నించి ముగ్గురిని రక్షించారు. మిగతావారిని రక్షించేందుకు కృషిచేస్తున్నారు. వారి బంధువులు, తోటి కార్మికులు గని వద్ద ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించారు. రాజస్థాన్ లోని నీమ్ కా థానా జిల్లాలోని కోలిహాన్ గనిలో మంగళవారం రాత్రి లిఫ్ట్ కూలిపోవడంతో హెచ్ సీఎల్ కు చెందిన 15 మంది అధికారులు చిక్కుకు పోయారు. ముగ్గురిని రక్షించారు. వారిని ఎకె శర్మ, హన్స్ రామ్, ప్రీతం సింగ్ గా గుర్తించారు. మిగిలిన 12 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని పరిస్థితిని సమీక్షించేందుకు కోల్ కతా నుంచి విజిలెన్స్ బృందం గనిలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 700 మీటర్ల లోతులో ఈ 15 మంది చిక్కుకు పోయారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
కాపర్ గనుల్లో చిక్కుకుపోయిన 15 మంది అధికారులు
0
249
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


