స్వతంత్ర సంక్షిప్త వార్తలు

వైరా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ …కూటమిదే పీఠం

ఇండియా కూటమి ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రామదాస్‌ నాయక్‌ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో విశ్లేషకులు, సర్వేలు ఇండియా కూటమిదే అధికారమని చెప్తున్నట్లు తెలిపారు. ఇండియా కూటమిని కోసం కష్టపడిన రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయింపు

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో గిరిజనుడిని పోలీసులు కొట్టారంటూ బీఆర్ఎస్‌ నేతలు, శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. స్టేషన్‌కు తనను పిలిచి చితకబాదారని, కేసు ఫైల్ చేయకుండా తనపై దాడి చేశారని బాధితుడు నవీన్ ఆవేదన చెందాడు. నిందితులపై చర్యలు తీసు కోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని బీఆర్ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

బస్సు బోల్తా

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజ మండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భారీ వర్షం కారణంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. క్లీనర్‌కు గాయాలు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

లారీ ఢీ

రోడ్డుకు ఇరువైపులా లారీలు పార్కింగ్ చేయడం వలన ఓ నిండు ప్రాణం బలిగొన్న సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం 163వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై రోడ్డుకు ఇరువైపు లా లారీలు పార్కింగ్ చేయడంతో ఓ లారీ బైక్‌ను ఢీకొని వెళ్లిపోయింది. రూలుకు విరుద్ధమైనా లారీలను ఇరువైపులా పార్కింగ్ చేయడం జరిగింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడవిలో మహిళ మృత దేహం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆ డెడ్‌బాడీ ఏటూరునాగారం మండలం కాటాపూర్ అంగన్‌వాడీ టీచర్ సుజాతగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్